Jagan: అధికారం కోసం హామీ లిచ్చే రకం కాదు జగన్: పోసాని కృష్ణమురళి

  • ఉండి నియోజకవర్గంలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర
  • జగన్ ని కలిసి ఈ పాదయాత్రలో పాల్గొన్న పోసాని
  • రాష్ట్రంలో ఇప్పుడున్న నేతల్లో మెరుగైన నేత జగన్: పోసాని

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్ ని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కలిశారు. జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో పోసాని మాట్లాడుతూ, జగన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడానికే వచ్చానని, రాష్ట్రంలో ఇప్పుడున్న నేతల్లో మెరుగైన నేత జగన్ అని కొనియాడారు. అధికారం కోసం హామీ లిచ్చే రకం జగన్ కాదని చెప్పిన పోసాని, పవన్ కల్యాణ్ శక్తి ఏమిటనేది ఇంకా తెలియదని అన్నారు. కాగా, జగన్ 172వ రోజు ప్రజా సంకల్పయాత్ర ఈరోజు ఉదయం ఆకివీడు నుంచి ప్రారంభమైంది. కుప్పనపుడి, కోలనపల్లి మీదుగా జగన్ యాత్ర కొనసాగింది. 

Jagan
Posani Krishna Murali
  • Loading...

More Telugu News