TTD: రమణ దీక్షితులను జైల్లో పెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి: సోమిరెడ్డి

  • శ్రీవారితో ఎవరు పెట్టుకున్నా నాశనమవుతారు
  • బీజేపీ నేతలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నారు
  • మా పార్టీ మహానాడుకు సిద్ధమైంది
  • బీజేపీ, వైసీపీ లాలూచీ రాజకీయాలను ఎండగడతాం

తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ ప్రధానార్చకులు చేస్తోన్న సంచలన ఆరోపణలతో వివాదం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రమణ దీక్షితులను జైల్లో పెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు. వేంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకున్నా వారు నాశనమవుతారని వ్యాఖ్యానించారు.

కాగా, బీజేపీ నేతలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ మహానాడుకు సిద్ధమైందని, బీజేపీ, వైసీపీ లాలూచీ రాజకీయాలు, కుట్రలను ఎండగడతామని అన్నారు. మహానాడుకు రోజుకు 36 వేల మంది కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు.

TTD
somireddy
Telugudesam
  • Loading...

More Telugu News