prabhas: 'సాహో' తదుపరి షెడ్యూల్ కి రెడీ అవుతోన్న ప్రభాస్

- ప్రభాస్ హీరోగా 'సాహో'
- 'అబుదాబి' షెడ్యూల్ పూర్తి
- వచ్చేనెలలో తదుపరి షెడ్యూల్
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, రీసెంట్ గా 'అబుదాబి'లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. 45 రోజుల పాటు జరిగిన ఈ మేజర్ షెడ్యూల్లో .. భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఖరీదైన కార్లు .. ట్రక్కులు ఉపయోగిస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.
