udhav thakre: యోగి కాదు భోగి..: యూపీ ముఖ్యమంత్రిపై ఉద్దవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు

  • యోగి అయితే అన్నీ వదిలేసి వెళ్లి గుహలో కూర్చోవాలి
  • కానీ, ఆయన వెళ్లి సీఎం కుర్చీలో కూర్చున్నాడు
  • ఆయన ఓ కపట సీఎం అంటూ సామ్నా పత్రికలో విమర్శలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే పార్టీ పత్రిక సామ్నాలో తీవ్రంగా ఏకిపారేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మహారాష్ట్రలోని పాల్ఘర్ లో పర్యటించారు. ఆ సందర్భంగా ఛత్రపతి శివాజీ ఫొటోకు పూల మాల వేశారు. ఆ సమయంలో కాలికి చెప్పులను ధరించే ఉన్నారు. ఇది ఉద్దవ్ ఠాక్రేకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

యోగి తన కాలికి ఉన్న అదే చెప్పును తీసుకుని ముఖంపై కొట్టుకోవాలని భావిస్తున్నానంటూ ఉద్దవ్ పేర్కొన్నారు. ‘‘కపట సీఎం. ఆయన యోగి కాదు. ఒక భోగి. యోగి అయితే అన్నీ వదిలేసి వెళ్లి గుహలో కూర్చోవాలి. కానీ, ఆయన వెళ్లి సీఎం కుర్చీలో కూర్చున్నాడు’’ అని ఉద్దవ్ సామ్నా పత్రికలో పేర్కొన్నారు.

udhav thakre
yogi adityanath
  • Loading...

More Telugu News