sanjay kishor: 'మహానటి' కోసం ఎంతో సహకరించాను .. కనీసం థ్యాంక్స్ కార్డు కూడా వేయలేదు!: సంజయ్ కిషోర్

- 'మహానటి' మంచి ప్రయత్నం
- సావిత్రికి సంబంధించిన మెటీరియల్ ఇచ్చాను
- వాటిని నేను సంపాదించడానికి యేళ్లు పట్టింది
సావిత్రి వీరాభిమానిగా .. ఆమె పేరుతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన సినీ ప్రేమికుడిగా సంజయ్ కిషోర్ కనిపిస్తారు. అలాంటి ఆయన తాజాగా yoyo టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'మహానటి' సినిమాను గురించి ప్రస్తావించారు. "సావిత్రికి సంబంధించి ఎవరు ఎలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించినా, అందుకు సంబంధించిన సమాచారం విషయంలో నా పేరు ప్రస్తావనకు వస్తుంటుంది.
