venkatesh: వెంకీ .. చైతూల మల్టీ స్టారర్ లో హీరోయిన్స్ ఖరారు!

  • బాబీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ 
  • వెంకీ సరసన నయనతార 
  • చైతూ జోడీగా రకుల్ ప్రీత్  

వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా దర్శకుడు బాబీ ఒక భారీ మల్టీ స్టారర్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలో ముందుగా కథానాయికల ఎంపికను పూర్తి చేశారు. వెంకటేశ్ సరసన నయనతారను .. చైతూ జోడిగా రకుల్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.గతంలో వెంకటేశ్ .. నయనతార కాంబినేషన్లో వచ్చిన లక్ష్మి .. తులసి .. బాబు బంగారం సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ జోడీకి మంచి క్రేజ్ ఉండటంతో కథానాయికగా నయనతారను సంప్రదించారట. త్వరలోనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో చైతూ జోడీగా రకుల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అందువలన ఆయన జోడీగా ఆమెను ఎంపిక చేసుకున్నారు. భరత్ చౌదరి .. కిరణ్ రెడ్డి నిర్మాతలుగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.    

venkatesh
chaitu
rakul
nayan
  • Loading...

More Telugu News