motkupalli narasimhulu: నేనేం తప్పు చేశానో చంద్రబాబు చెబితే ముక్కు నేలకు రాస్తా: మోత్కుపల్లి

  • మహానాడుకు నన్నెందుకు పిలవలేదు
  • తెలంగాణలో చంద్రబాబుకు విశ్వసనీయత లేదు
  • ఆయన కంటే కేసీఆరే నయం

తాను చేసిన తప్పేంటో చెబితే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మహానాడుకు తనను ఆహ్వానించకపోవడంపై గత రెండు రోజులుగా అసంతృప్తిగా ఉన్న ఆయన శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

తనను పిలిచి మాట్లాడి ఉంటే అన్నీ చెప్పే వాడినన్న ఆయన, పార్టీలో సీనియర్‌ను అయినా, దళితుడిని కాబట్టే పిలవలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన కంటే కేసీఆరే బెటరని అన్నారు. తాను ఇప్పటికీ చంద్రబాబు పక్షమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీకి జరుగుతున్న నష్టంపై మాట్లాడాలని అనుకుంటే అవకాశం ఇవ్వడం లేదని మోత్కుపల్లి వాపోయారు.  

motkupalli narasimhulu
Telugudesam
Telangana
Chandrababu
  • Loading...

More Telugu News