Kumaraswamy: రియల్‌ యాక్షన్‌ ఇప్పుడే మొదలవుతుంది: కర్ణాటక సీఎం కుమారస్వామి

  • కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతా
  • బీజేపీ బెదిరింపులను పట్టించుకోను
  • ప్రజలకు చేయాల్సింది చేస్తూనే ఉంటాం     

కాంగ్రెస్‌ పార్టీతో కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్‌ నేత కుమారస్వామి ఈ రోజు బల పరీక్షలో సునాయాసంగా నెగ్గిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ రాష్ట్రంలో రియల్‌ యాక్షన్‌ ఇప్పుడు మొదలవుతుందని వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రజలకు తాను ఏయే హామీలు ఇచ్చానో అవన్నీ ఇక నెరవేర్చుతానని అన్నారు. 24 గంటల్లో రైతు రుణమాఫీ చేయకపోతే ఈ నెల 28న కర్ణాటక బంద్‌ నిర్వహిస్తామని బీజేపీ నేత యడ్యూరప్ప హెచ్చరించిన విషయంపై మాట్లాడుతూ.. తాను ఎటువంటి బెదిరింపులను పట్టించుకోనని అన్నారు. తాము ప్రజలకు చేయాల్సివి చేస్తూనే ఉంటామని తెలిపారు.        

Kumaraswamy
Congress
Karnataka
jds
  • Loading...

More Telugu News