Tirumala: పవన్ కల్యాణ్‌కు అవగాహన లేదు: శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు

- ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్థుల సమస్యలపై పవన్ దీక్ష
- ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోందన్న అచ్చెన్నాయుడు
- గతంలో పవన్ సూచనలు చేశారని వ్యాఖ్య
- రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ విమర్శలని ఆగ్రహం
ఉద్ధానం సమస్యలపై స్పందించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ నిరాహార దీక్షకు దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళంలోని టెక్కలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్థుల సమస్యను తొలగించడానికి ప్రభుత్వం చేపడుతోన్న చర్యలపై పవన్ కల్యాణ్‌కు అవగాహన లేదని అన్నారు. గతంలో పవన్ కల్యాణ్ చేసిన సూచనలతో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని, రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై కూడా పవన్‌తో పాటు జగన్ మోదీని విమర్శించకుండా సొంత ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.
కాగా, తిరుమల- తిరుపతి దేవస్థాన మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేస్తోన్న సంచలన ఆరోపణలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు టీటీడీలో జరుగుతోన్న సంఘటనలపై వేంకటేశ్వర స్వామే తీర్పు ఇస్తారని అన్నారు.