Karnataka: బీజేపీ ఆడమన్నట్టు మేము ఆడే ప్రసక్తే లేదు: డీకే శివకుమార్

  • రైతు రుణ మాఫీ చేయకపోతే బంద్ చేస్తామని బీజేపీ చెబుతోంది
  • ఇలాంటి వ్యాఖ్యలతో బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే ఊరుకోం
  • రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవహరిస్తాం

కర్ణాటకలో బీజేపీ ఆడమన్నట్టు తామేమీ ఆడమని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిన అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోగా రైతు రుణాలు మాఫీ చేయకపోతే ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్త బంద్ చేపడతామని బీజేపీ హెచ్చరించడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఇటువంటి వ్యాఖ్యల ద్వారా బీజేపీ తమను బ్లాక్ మెయిల్ చేయలేదని, రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవహరిస్తామని చెప్పారు. కాగా, కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం మూజువాణి ఓటుతో విశ్వాసపరీక్ష నెగ్గింది. కుమారస్వామికి 117 మంది సభ్యుల మద్దతు లభించింది. విశ్వాసపరీక్షకు ముందే సభ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది.

Karnataka
bjp
Congress
siva kumar
  • Loading...

More Telugu News