keerti suresh: 'మహానటి' సక్సెస్ ను మరిచిపోలేను: కీర్తి సురేశ్

- సావిత్రి గారి పాత్రలో చేయడం అదృష్టం
- దర్శక నిర్మాతలు ఎంతగానో సహకరించారు
- ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు
సావిత్రి చనిపోయిన దగ్గర నుంచి .. అందుకు గల కారణాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఆమె అభిమానుల్లో అలా ఉండిపోయింది. వాళ్లందరి సందేహాలకు 'మహానటి' సమాధానంగా నిలిచింది. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, అన్ని ప్రాంతాల్లోను విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దర్శక నిర్మాతలతో పాటు కీర్తి సురేశ్ .. విజయ్ దేవరకొండ .. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.
