Chandrababu: చంద్రబాబు పగటికలలు కంటున్నారు: బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు

  • కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ బాబు పగటికలలు 
  • నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది తానేనంటున్నారు
  • ప్రధాని కూడా అయ్యే వాడినని చెబుతున్నారు
  • రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునే యత్నమది   

కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ చంద్రబాబు పగటికలలు కంటున్నారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది తానేనని, ప్రధాని కూడా అయ్యే వాడినని చంద్రబాబు అంటున్నారని, రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. రెండు ఎకరాల నుంచి అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు ఎలా ఎదిగారో అందరికీ తెలుసని, ప్రజల ముందు దోషిగా బాబు నిలబడటం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Chandrababu
bjp
gvl narasimha rao
  • Loading...

More Telugu News