Bollywood: అర్హులు కాని వారికి అందమైన భార్యలంటూ నెటిజన్ ట్వీట్.. అభిషేక్ ఘాటుగా రిప్లై!

  • క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ, నటుడు అభిషేక్ పై ఓ నెటిజన్ విమర్శలు
  • వాళ్ల తండ్రుల ప్రజాదరణను వీళ్లిద్దరూ వాడుకున్నారు
  • ఒకరు క్రికెట్ లోకి,మరొకరు సినిమాల్లోకి వచ్చారు
  • అందమైన భార్యలను పొందే అర్హత బిన్నీ, అభిషేక్ కు ఉందా?

భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ లపై ఓ నెటిజన్ తీవ్ర విమర్శలు చేశాడు. తమ తండ్రుల ప్రజాదరణను వాడుకుని ఒకరు క్రికెట్ లోకి అడుగుపెడితే, మరొకరు సినీ రంగంలోకి వచ్చారని వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా..అర్హులు కాని వారికి అందమైన భార్యలు వచ్చారని వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్ తమకు నిజమనిపిస్తే రీ ట్వీట్ చేయండంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పై స్పందించిన అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో బదులిచ్చాడు.

‘సోదరా, నా అడుగు జాడల్లో ఒక మైలు దూరం ప్రయాణించు. మీరు కనీసం పది అడుగులు ప్రయాణించినా చాలు నేను ప్రభావితమవుతాను... నిన్ను నువ్వు మెరుగుపరచుకోవడం కోసం సమయం వెచ్చించు..ఇతరుల గురించిన ఆలోచన పక్కనపెట్టు. దేవుడికి తెలుసు.. ఎవరి ప్రయాణం వారిదేనని. తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని అభిషేక్ చెప్పాడు.

ఈ ప్రతిస్పందన చూసిన సదరు నెటిజన్ తనను తాను సమర్థించుకుంటూ మరో ట్వీట్ చేశాడు. ‘కేవలం.. సరదాకు ఆ ట్వీట్ చేశా. ప్రశాంతమైన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. థియేటర్లో నీ సినిమా ఆడకపోయినా, మీరు ధరించే సూట్స్ లో బాగుంటారు. ఆ ట్వీట్ కేవలం జోక్ మాత్రమే. మీ మనసు నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నా. అమితాబ్ కుమారుడైన మీపైన, సచిన్ కుమారుడు అర్జున్ పైనా ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోగలను..క్షమాపణలు’ అని సదరు నెటిజన్ అన్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News