kalyan ram: 'నా నువ్వే' ఆ రోజున థియేటర్స్ కి రావడం లేదట!

  • జయేంద్ర దర్శకత్వంలో 'నా నువ్వే' 
  • కల్యాణ్ రామ్ జోడీగా తమన్నా 
  • త్వరలోనే విడుదల తేదీపై ప్రకటన  

కల్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు జయేంద్ర 'నా నువ్వే' సినిమా చేశాడు. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదలను జూన్ 1వ తేదీకి వాయిదా వేసినట్టుగా చెప్పారు. అయితే ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్స్ కి వచ్చే అవకాశం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

 కల్యాణ్ రామ్ జోడిగా .. రేడియో జాకీ పాత్రలో తమన్నా నటించింది. ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతవరకూ కల్యాణ్ రామ్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉండొచ్చని అనుకున్నారు. అయితే గ్రాఫిక్స్ తో పాటు ఇతర పనులు కొన్ని పూర్తికాకపోవడం వలన, జూన్ 1వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోవచ్చని చెప్పుకుంటున్నారు. కొత్త విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని అంటున్నారు.    

kalyan ram
tamannah
  • Loading...

More Telugu News