Congress: విశ్వాస పరీక్షకు ముందే కర్ణాటక అసెంబ్లీ నుంచి బీజేపీ నేతల వాకౌట్
- కాంగ్రెస్-జేడీఎస్‌పై యడ్యూరప్ప మండిపాటు
- 24 గంటల్లో రైతు రుణమాఫీ చేయాలి
- లేకపోతే ఈ నెల 28న కర్ణాటక బంద్
కర్ణాటక శాసనసభ నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో యడ్యూరప్ప సుదీర్ఘంగా మాట్లాడారు. కాంగ్రెస్-జేడీఎస్ నేతలు అపవిత్ర రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
కుమారస్వామి తీరుకి నిరసనగా తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల ముందు కుమారస్వామి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. 24 గంటల్లో రైతు రుణమాఫీ చేయకపోతే ఈ నెల 28న కర్ణాటక బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం యడ్యూరప్ప తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.