yaddyurappa: శాసనసభ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తాం: యడ్యూరప్ప

  • కర్ణాటక శాసన సభాపతిగా రమేష్‌కుమార్‌ ఏకగ్రీవం
  • శాసనసభ్యుల అభినందనలు
  • రమేష్‌ అనుభవం ఉన్న వ్యక్తని ప్రశంసలు

శాసనసభ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు. కర్ణాటక శాసన సభాపతిగా రమేష్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ... స్పీకర్‌ పదవి గౌరవం నిలబెట్టేందుకే ఏకగ్రీవం చేయాలనుకున్నామని, తమ స్పీకర్‌ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నామని చెప్పుకొచ్చారు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి సభాపతి కావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.

కాగా, సభాపతి రమేష్‌కుమార్‌కు సీఎం కుమారస్వామి అభినందనలు తెలిపారు. గతంలోనూ స్పీకర్‌గా రమేష్‌ సమర్థవంతంగా పనిచేశారని కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య అన్నారు. కాసేపట్లో జేడీఎస్‌-కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది.  

yaddyurappa
Karnataka
BJP
Congress
  • Loading...

More Telugu News