poonam kaur: దర్శకుడిపై పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్స్.. హాట్ టాపిక్!

- నాకు హిట్లు లేవని సాకులు చెప్పాడు
- ఎన్నారై హీరోయిన్లకు అవకాశాలు ఇచ్చాడు
- వాళ్లకి కూడా హిట్లు లేవే మరి!
తెలుగు తెరపై అందాల కథానాయికగా మంచి మార్కులు కొట్టేసిన పూనమ్ కౌర్, సక్సెస్ లను తన ఖాతాలో వేసుకోలేక వెనుకబడిపోయింది. అలాంటి పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్స్ .. ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారాయి. 'జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి' అంటూ ఆమె చేసిన ట్వీట్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన ఈ ట్వీట్ లో రెండు సినిమా పేర్లను వాడటంతో ఈ విషయం మరింత వేడెక్కింది.
