whatsapp: వాట్సాప్ ఇమేజెస్ ఇకపై ఫోన్ గ్యాలరీలో కనిపించకుండా చేసుకోవచ్చు...!
- కొత్తగా మీడియా విజిబిలిటీ, కాంటాక్ట్ షార్ట్ కట్ ఫీచర్లు
- మీడియా విజిబిలిటీ ఆప్షన్ ను అన్ టిక్ చేసుకుంటే గ్యాలరీలో ఫొటోలు కనిపించవు
- ఫోన్ ఫైల్ మేనేజర్ లో వాట్సాప్ ఫొటోలను యాక్సెస్ చేసుకోవచ్చు
మీ ఫోన్ గ్యాలరీ యాప్ ను ఓపెన్ చేసినప్పుడు అందులో వాట్సాప్ లో షేర్ చేసుకున్న ఫొటోలు కనిపించడం చూసే ఉంటారు. దీని గురించి ఎక్కువ మందికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. అయితే, కొందరు ప్రైవసీ కోణంలో వాట్సాప్ ఇమేజెస్ ను గ్యాలరీలో కనపించకూడదని కోరుకుంటుంటారు. ఈ అవసరాన్ని వాట్సాప్ గుర్తించింది. బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ ను చేర్చింది. ఈ ఫీచర్ పేరు మీడియా విజిబిలిటీ. నిజానికి ఇన్ స్టాగ్రామ్ సహా ఇతర మెస్సేజింగ్ యాప్స్ ఈ ఫీచర్ ను ఇప్పటికే అందిస్తున్నాయి.
వాట్సాప్ లో సెట్టింగ్స్, డేటా, స్టోరేజీ యూసేజ్ ఆప్షన్ కు వెళ్లాలి. అక్కడ షో మీడియా ఇన్ గ్యాలరీ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఇది డిఫాల్ట్ గా టిక్ చేసి ఉంటుంది. ఒకవేళ వాట్సాప్ ఇమేజెస్ గ్యాలరీలో కనిపించకూడదనుకుంటే దీన్ని అన్ టిక్ చేసుకోవాలి. దాంతో గ్యాలరీ యాప్ వాట్సాప్ ఇమేజెస్ ను చూపించదు. అయితే, ఫైల్ మేనేజర్ కు వెళ్లి అక్కడ వాట్సాప్ ఇమేజెస్ చూసుకోవచ్చు.
కాంటాక్ట్ షార్ట్ కట్ పేరుతో మరో ఫీచర్ కూడా వచ్చేసింది. వాట్సాప్ చాట్ స్క్రీన్ లో కింది భాగంలో కుడివైపున న్యూ మెస్సేజ్ బటన్ ను ప్రెస్ చేస్తే కాంటాక్ట్ షార్ట్ కట్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి కాంటాక్ట్ లకు యాడ్ చేసుకోవచ్చు.