Karnataka: బలపరీక్షకు ముందే కుమారస్వామి విజయం... స్పీకర్ అభ్యర్థిని ఉపసంహరించుకున్న బీజేపీ!

  • బీజేపీ స్పీకర్ అభ్యర్థి సురేష్ కుమార్
  • నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్న సురేష్
  • స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రమేష్ కుమార్

కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్షలో విజయం సాధించినట్టే. విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్ ఎన్నిక జరగాల్సి వుండగా, బీజేపీ వెనక్కు తగ్గింది. ఆ పార్టీ తరఫున నామినేషన్ వేసిన సురేష్ కుమార్ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.

దీంతో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ కుమార్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కానుండటంతో, ఆపై జరిగే విశ్వాస పరీక్ష ఇక లాంఛనమే. తమ స్పీకర్ అభ్యర్థిని గెలిపించుకునేంత సంఖ్యా బలం తమ వద్ద లేదని భావించడంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కాగా, కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ప్రారంభంకాగా, స్పీకర్ గా రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటన వెలువడనుంది.

Karnataka
BJP
Congress
Nomination
Speaker
Unanimous
  • Loading...

More Telugu News