savithri: పెళ్లి విషయంలో సావిత్రి నా మాట కూడా వినలేదు: చిన్ననాటి స్నేహితురాలు సుశీల

- జెమినీతో పెళ్లి వద్దని అంతా చెప్పారు
- సావిత్రితో గల స్నేహం కారణంగా నేనూ అదే చెప్పాను
- ఆమె వినిపించుకునే పరిస్థితుల్లో లేదు
తెలుగు .. తమిళ భాషల్లో సావిత్రికి ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు వున్నారు. ఈ రెండు భాషల్లో ఆమె జీవితచరిత్ర తెరకెక్కడంతో, అంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. 'మహానటి' సినిమాలో సావిత్రి చిన్ననాటి స్నేహితురాలిగా సుశీల పాత్ర కనిపిస్తుంది. ఆ సుశీల ఇప్పుడు ఎక్కడ ఉందోనని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడలోనే ఉంటోన్న ఆమె, తాజాగా 'వనిత' టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
