Kumaraswamy: కన్నడనాట కాంగ్రెస్ పై ఆశలు పెట్టకున్న బీజేపీ!

  • నేడు కుమారస్వామి విశ్వాసపరీక్ష
  • కాంగ్రెస్ అసంతృప్తులు బయటకు వస్తారని బీజేపీ ఆశ
  • పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ఆలోచన

నేడు కర్ణాటకలో కుమారస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కోనుండగా, కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులు బయటకు వస్తారని, అసెంబ్లీలోనే వారు తమ నిరసనను తెలుపుతారని, కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. లింగాయత్ లకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే తామంతా రాజీనామా చేస్తామని ఆ వర్గం ఎమ్మెల్యేలు హెచ్చరించినట్టు వచ్చిన వార్తలు బీజేపీలో కొత్త ఆశలను కలిగిస్తున్నాయి.

ఇదే సమయంలో ఎమ్మెల్యేల సమావేశానికి సీనియర్ నేత, డిప్యూటీ సీఎం పదవిని ఆశించిన డీకే శివకుమార్ గైర్హాజరు కావడంతో ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా లేరన్న సంకేతాలు వెలువడగా, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ సైతం తనవంతు కృషిని ప్రారంభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే, అది తమకు అనుకూలిస్తుందన్నది బీజేపీ ఆశ.

Kumaraswamy
Congress
Karnataka
BJP
JDS
  • Loading...

More Telugu News