Ramcharan: నా సినిమా పోస్టర్లపై ఇకపై అలాంటివి వేయవద్దు: రామ్ చరణ్

  • సినిమా బాగుందనే ప్రశంసే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది
  • వసూళ్ల నంబర్ల వల్ల వివాదాలు కూడా తలెత్తుతున్నాయి
  • సోషల్ మీడియాకు దూరంగా ఉంటా

రానున్న రోజుల్లో తన సినిమా పోస్టర్లపై వసూళ్లకు సంబంధించిన వివరాలను వేయవద్దని నిర్మాతలను కోరుతున్నానని చరణ్ తెలిపాడు. 'మీ సినిమా చాలా బాగుంది' అనే ప్రశంస కన్నా, వసూళ్ల నంబర్లు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వలేవని చెప్పాడు. ఈ నంబర్ల వల్ల లేనిపోని వివాదాలు కూడా తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చరణ్ తెలిపాడు. ఫేస్ బుక్ అకౌంట్ ఒకటి ఉన్నప్పటికీ... దాన్ని తన ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంటాడని చెప్పాడు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో తాను లేనని వివరించాడు. తాను ఎక్కువగా వాట్సాప్ నే వాడుతుంటానని చెప్పాడు. 

Ramcharan
Facebook
Twitter
Instagram
Social Media
collections
  • Loading...

More Telugu News