Karnataka: యడ్యూరప్పపై ఏసీబీకి కాంగ్రెస్ ఫిర్యాదు!

  • యడ్యూరప్ప, ఇతర బీజేపీ నేతలపై ఏసీబీ ఫిర్యాదు
  • బలపరీక్షలో నెగ్గేందుకు డబ్బు ఆశ
  •  కేసు నమోదు చేయాల్సిందిగా లేఖ

కర్ణాటకలో బీజేపీకి అధికారం దక్కకుండా చివరి వరకు ప్రయత్నించి సఫలమైన కాంగ్రెస్.. ఇప్పుడు మాజీ సీఎం యడ్యూరప్పతోపాటు పలువురు బీజేపీ నేతలపై అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)కి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ న్యాయవాది ఒకరు బెంగళూరు అర్బన్ వింగ్, యాంటీ కరెప్షన్ బ్యూరో ఎస్పీకి లేఖ రాశారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గేందుకు కుట్రలకు పాల్పడ్డారని అందులో ఆరోపించారు. ఫ్లోర్ టెస్ట్‌లో ఎలాగైనా నెగ్గేందుకు నేరపూరిత కుట్ర, అవినీతికి పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలు ఇస్తామని ఆశ చూపారని, మంత్రి పదవులు కూడా ఇస్తామని ప్రలోభపెట్టారని లేఖలో పేర్కొన్నారు.

Karnataka
Congress
Yeddyurappa
KPCC
  • Loading...

More Telugu News