Tollywood: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన సినీ దర్శకుడు బాబీ

  • జూబ్లీహిల్స్‌లో మరో కారును ఢీకొట్టిన దర్శకుడు బాబీ
  •  సినీ పెద్దల పేర్లు చెప్పి బెదిరించి పరారీ
  • బుధవారం రాత్రి లొంగిపోయిన డైరెక్టర్

జూబ్లీహిల్స్‌లో ఓ కారును ఢీకొట్టి, ప్రశ్నించినందుకు తనకు పలువురు పెద్దలతో సంబంధాలున్నాయని బెదిరించి పరారైన టాలీవుడ్ దర్శకుడు బాబీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. అమీర్‌పేటకు చెందిన హర్మిందర్ సింగ్ తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప సొసైటీలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 33లో వారి కారును దర్శకుడు బాబీ కారు వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో హర్మిందర్ కారు వెనక భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో బాబీని నిలదీశాడు. బాబీతోపాటు కారు దిగిన మరో ముగ్గురు హర్మిందర్‌ను బెదిరించే ప్రయత్నం చేశారు. తానో పెద్ద దర్శకుడినని,  పలువురు పెద్దలతో సంబంధాలున్నాయని చెబుతూ అక్కడి నుంచి పరారయ్యాడు.  దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినీ ప్రముఖుల పేర్లు చెప్పి బాబీ తనను బెదిరించాడని ఆరోపించారు.  బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాబీ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.

  • Loading...

More Telugu News