Hyderabad: చిన్నారిని అపహరించి హతమార్చిన గుర్తుతెలియని వ్యక్తులు!

  • హైదరాబాద్ లో సంఘటన
  • చిన్నారి అక్షరను అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు
  • జలవిహార్ వద్ద నీటికుంటలో అక్షర మృతదేహం

ఓ చిన్నారిని అపహరించి హతమార్చిన విషాద సంఘటన హైదరాబాద్ లో జరిగింది. ఈరోజు మధ్యాహ్నం తమ కూతురు అక్షర అపహరణకు గురైందంటూ ఆమె తల్లిదండ్రులు రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు చిన్నారి కోసం పోలీసులు గాలిస్తుండగా, నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ వద్ద నీటి కుంటలో మృతదేహాన్నిగుర్తించారు. అక్షర మృతదేహంగా గుర్తించిన పోలీసులు, ఈ సమాచారాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేశారు. అక్షర మృతి వార్తతో పాప తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News