petrol: 'చర్యలు తీసుకుంటున్నాం'.. పెట్రోలు ధరల పెరుగుదలపై పెట్రోలియం శాఖ మంత్రి వివరణ

  • సత్వర పరిష్కారం కోసం చర్చలు 
  • జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని యోచన
  • శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా చర్చలు

పెట్రోల్‌ ధరల పెరుగుదలపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరణ ఇచ్చారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పెట్రోల్‌ ధరల పెరుగుదలను అదుపు చేయడానికి సత్వర పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతోందని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని తాము యోచిస్తున్నట్లు తెలిపారు.

ధరల పెరుగుదలకు తప్పకుండా పరిష్కారం కనుగొంటామని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కి రూ.2 చొప్పున ఎక్సైజ్‌ తగ్గించిందని, ఈ సారి మాత్రం ధరల పెరుగుదలకు శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా చర్యలు తీసుకోనుందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింత తగ్గిపోవడం, చమురు ధరలు పెరగడం వంటి కారణాల వల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News