vijay devarakonda: విజయ్ దేవరకొండ మూవీలో గెస్టుగా అనూ ఇమ్మాన్యుయేల్!

  • యూత్ లో అనూ ఇమ్మాన్యుయేల్ కి క్రేజ్
  • షూటింగు దశలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • నిరుత్సాహపరిచిన రెండు పెద్ద సినిమాలు

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందాల కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. 'మజ్ను' తోనే కుర్రకారు మనసులు దోచుకున్న ఈ సుందరికి, పవన్ సరసన .. అల్లు అర్జున్ జోడీగా అవకాశాలు వచ్చాయిగానీ విజయాలు దక్కలేదు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాపైనే వున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమె గెస్టు రోల్ చేయడానికి అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ ఒక సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఒక గెస్టు రోల్ కి, క్రేజ్ వున్న హీరోయిన్ అయితే బాగుంటుందని భావించి అనూ ఇమ్మాన్యుయేల్ ను సంప్రదిస్తే ఆమె ఓకే చెప్పేసిందట. గీతా ఆర్ట్స్ బ్యానర్ కి గల పేరును దృష్టిలో పెట్టుకునే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. ఏదేవైనా ఈ సమయంలో ఆమె గెస్టు రోల్ కి ఓకే చెప్పడం సాహసోపేతమైన నిర్ణయమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   

vijay devarakonda
anu emmanuel
  • Loading...

More Telugu News