gold: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి రేటు
- పసిడి ధర రూ.125 పెరిగి, రూ.32,125గా నమోదు
- వెండి ధర రూ.100 తగ్గి రూ.41,300కి చేరిక
- సింగపూర్ మార్కెట్‌లో ఔన్సు పసిడి 1,295.70 డాలర్లు
బులియన్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగిపోతోంది. పది గ్రాముల పసిడి ధర ఈరోజు రూ.125 పెరిగి, రూ.32,125గా నమోదైంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక బంగారు ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరిగాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
మరోవైపు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.41,300కి చేరింది. ఇక గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర 0.21 శాతం పెరిగి సింగపూర్ మార్కెట్‌లో ఔన్సు ధర 1,295.70 డాలర్లుగా నమోదైంది.