kim jong un: ఇచ్చిన మాటను నిలుపుకున్న కిమ్ జాంగ్.. న్యూక్లియర్ టెస్ట్ సైట్ నిర్మూలన

  • పుంగ్యే-రి న్యూక్లియర్ సైట్ ను నిర్మూలించిన ఉ.కొరియా
  • న్యూక్లియర్ సైట్ కు చేరుకున్న డజన్ల కొద్ది విదేశీ జర్నలిస్టులు
  • అమెరికా యుద్ధం ఆపేస్తే.. అణు ప్రయోగాలు అవసరం లేదని ఇటీవల ప్రకటించిన కిమ్ జాంగ్

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తాను ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. న్యూక్లియర్ టెస్టులను ఇకపై చేపట్టబోమని, టెస్ట్ సైట్లను నిర్మూలిస్తామని చేసిన ప్రకటనను ఆయన నిజం చేశారు. పుంగ్యే-రి న్యూక్లియర్ టెస్ట్ సైట్ ను ఉత్తరకొరియా నిర్మూలించిందని మీడియా సంస్థ జిన్హువా ప్రకటించింది.

ఉత్తరకొరియా ఆహ్వానం మేరకు డజన్ల కొద్ది విదేశీ జర్నలిస్టులు చైనా రాజధాని బీజింగ్ నుంచి మంగళవారం ఉదయం బయల్దేరి న్యూక్లియర్ సైట్ కు చేరుకున్నారని జిన్హువా తెలిపింది. అమెరికా యుద్ధాన్ని ఆపితే తమకు అణ్వాయుధ ప్రయోగాలతో ఎలాంటి అవసరం లేదని ఇటీవలే కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

kim jong un
Punggye ri
nuclear test site
North Korea
  • Loading...

More Telugu News