Tamilnadu: తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు.. తెలుగు వ్యక్తి నియామకం

  • స్టెరిలైట్‌ కాపర్‌ తయారీ ప్లాంటుకు వ్యతిరేకంగా ఆందోళనలు
  • కలెక్టర్‌ వెంకటేశన్‌తో పాటు ఎస్పీ మహేంద్రన్‌ బదిలీ
  • జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నండూరి సందీప్‌

తమిళనాడులోని తూత్తుకుడిలో ఆందోళనలు తీవ్ర తరమైన విషయం తెలిసిందే. స్టెరిలైట్‌ కాపర్‌ తయారీ ప్లాంటుకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో పోలీసుల చేతిలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. చర్యలు తీసుకునే పనిలో పడ్డ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా కలెక్టర్‌ ఎన్‌.వెంకటేశన్‌తో పాటు ఎస్పీ పీ మహేంద్రన్‌లను బదిలీ చేసింది.

దీంతో ఆ జిల్లా కలెక్టర్‌గా తెలుగు వ్యక్తి నండూరి సందీప్‌ను నియమించారు. ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వర్తిస్తున్నారు. తూత్తుకుడిలో ఆందోళనలు చెలరేగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తూత్తుకుడి కాపర్‌ ప్లాంట్‌ విస్తరణను నిలిపేయాని మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Tamilnadu
District Collector
thoothukudi
  • Loading...

More Telugu News