Pawan Kalyan: ఫ్యాన్స్ ను నిరాశపరిచిన పవన్ కల్యాణ్!

  • ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటనలో ఉన్న పవన్
  • ఓ రిసార్టులో బస
  • విషయం తెలుసుకుని భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్
  • రిసార్టులోనే ఉండిపోయిన జనసేనాని

తమ అభిమాన నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఒక్కసారైనా దగ్గర నుంచి చూడాలని వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం ప్రాంతంలోని ఓ రిసార్టులో బసచేసి ఉన్నారు. నిన్న టెక్కలిలో పర్యటనను ముగించుకుని సాయంతం, 6.45 గంటల ప్రాంతంలో పవన్ రిసార్టు వద్దకు రాగా, అప్పటికే ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరారు.

నేషనల్ హైవేకు ఈ ప్రాంతం 6 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండటంతో రిసార్టు ప్రాంతం పవన్ అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. అయితే, తమను పలకరించేందుకు పవన్ ఒక్కసారైనా బయటకు వస్తారని అభిమానులు ఆశించగా, పవన్ బయటకు రాలేదు. దీంతో రాత్రి బాగా పొద్దుపోయేవరకూ వేచి చూసిన అభిమానులు, ఆపై నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఈ ఉదయం తన యాత్రను కొనసాగించేందుకు బయటకు వచ్చిన సమయంలో మాత్రం అక్కడున్న అభిమానులకు పవన్ అభివాదం చేశారు.

Pawan Kalyan
Srikakulam District
Tekkali
Fans
  • Loading...

More Telugu News