raviteja: ఇలియానా ఏ మాత్రం తగ్గడం లేదు .. 2 కోట్లు అడిగేసిందట!

- షూటింగు దశలో 'అమర్ అక్బర్ ఆంటోని'
- ఒక కథానాయికగా ఇలియానా
- రవితేజతో ఆమెకి ఇది నాల్గవ సినిమా
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో ఇలియానా ఒకరు. తెలుగులో అగ్ర హీరోల జోడీ కడుతూ, యూత్ ను ఒక ఊపు ఊపేసింది. అలాంటి ఇలియానా బాలీవుడ్ సినిమాల పట్ల ఆసక్తితో తెలుగు సినిమాలకి దూరమైంది. తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె ఎదురుచూస్తోన్న సమయంలోనే ఆమెకి ఇక్కడి నుంచి అవకాశం వెళ్లింది .. అదీ రవితేజ సరసన.
