Karnataka: కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవికి పరమేశ్వర్ రాజీనామా

  • ఒక వ్యక్తికి రెండు పదవులు వద్దంటున్న కాంగ్రెస్
  • ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పరమేశ్వర్
  • కేపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా

బుధవారం నాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పరమేశ్వర్, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి లభించినందునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకరికి రెండు కీలకమైన పదవులు ఉండరాదన్న కాంగ్రెస్ అధిష్ఠానం సూచన మేరకు పీసీసీ పదవిని వదులుకుంటున్నట్టు ఈ సందర్భంగా పరమేశ్వర్ వ్యాఖ్యానించారు.

కాగా, పరమేశ్వర్ కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవిలో 8 సంవత్సరాలపాటు కొనసాగారు. 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించి, అధికారంలోకి రావడానికి కృషి చేశారు. ఆపై 2014 లోక్ సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన హవా కొనసాగింది. గతంలో హోమ్ మంత్రి పదవిలో ఉన్న ఆయన, అప్పట్లో పీసీసీ పదవిని వదులుకునేది లేదని, కావాలంటే హోమ్ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పీసీసీ పదవిని ఆయన త్యాగం చేశారు.

Karnataka
KPCC
Parameshwar
Resign
  • Loading...

More Telugu News