Pawan Kalyan: నేను మిలిటరీ చొక్కా ధరించడానికి కారణం ఇదే: పవన్ కల్యాణ్

  • శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న పవన్ యాత్ర
  • మిలిటరీ చొక్కాతో ఆకట్టుకుంటున్న జనసేనాని
  • శ్రీకాకుళం జిల్లా సైనికుల స్ఫూర్తితోనే తాను ఈ చొక్కా ధరించానని చెప్పిన పవన్

జనసేన అధినేత తన రాష్ట్ర వ్యాప్త పర్యటనను శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన యాత్ర సందర్భంగా పలు సమస్యలపై ఆయన గళం వినిపిస్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తన పోరాటం ఆగదని ఆయన హెచ్చరిస్తున్నారు. తాను ఎవరికీ భయపడనని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా జనసైనికులతో కలసి పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తానని ఆయన చెప్పారు.

అయితే, యాత్రలో ఆయన వేషధారణ అందరినీ ఆకట్టుకుంటోంది. మిలిటరీ రంగు చొక్కా ధరించి, మెడలో ఎర్ర రంగు కండువా వేసుకుని ఆయన ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. తన వేషధారణ గురించి పవన్ స్పందిస్తూ, దేశంలో ఏ మూలకు వెళ్లినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సైనికుడు కనపడతాడని, జైహింద్ అంటాడని చెప్పారు. వారి స్ఫూర్తితోనే తాను మిలిటరీ చొక్కా ధరించానని తెలిపారు. 

Pawan Kalyan
yatra
srikakulam
shirt
military
  • Loading...

More Telugu News