ICC: ఈ వీడియోలోని బ్యాట్స్ మెన్ అవుటా? నాటౌటా?... ఐసీసీ కి చేరిన పంచాయితీ!

  • గల్లీ క్రికెట్ వీడియోను పోస్టు చేసిన హంజా
  • బ్యాట్స్ మెన్ అవుటా? నాటౌటా? అని ప్రశ్న
  • అవుటేనని తేల్చిన ఐసీసీ

మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా గల్లీ క్రికెట్ ఆడారా? వెనకాల వికెట్లు లేకుండా ఏ గోడకో బొగ్గుతో వికెట్ల బొమ్మ గీసి ఆడుతుంటే, అవుట్ అయ్యావని బౌలర్ అంటే, కాదని వాదించిన సందర్భాలు ఉన్నాయా? అవుట్, నాటవుట్ విషయంలో పేచీలు పెట్టుకున్నారా? అటువంటిదే ఈ ఘటన. అయితే, ఈ పంచాయితీ ఏకంగా ఐసీసీకి చేరింది.

హంజా అనే క్రికెట్ అభిమాని, ఐసీసీని ట్యాగ్ చేస్తూ, ఓ వీడియోను పంపి, ఇది ఔటా? నాటౌటా? తేల్చాలని కోరాడు. ఈ వీడియోలో, కొందరు ఆడుతుండగా, బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్ మన్ బలంగా కొట్టాడు. అది దూసుకెళ్లి, ఎదురుగా ఉన్న దేన్ని తాకిందో కనిపించడం లేదుగానీ, తిరిగి వికెట్లపైకి వచ్చింది. ఆ బంతిని ఆపేందుకు బ్యాట్స్ మన్ ప్రయత్నించినా ఆగకుండా వెళ్లి వికెట్లను పడేసింది. ఈ వీడియోను చూసిన ఐసీసీ పెద్దలు, క్రికెట్ నిబంధనల్లోని 32 (1) ప్రకారం అవుటని చెబుతూ రీ ట్వీట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షల మందికి పైగా చూశారు. మీరూ ఓ లుక్కేయండి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News