Jagan: గతంలో తిరుమల జోలికి వచ్చిన వారు ఎక్కడ ఉన్నారో మీకే బాగా తెలుసు!: నారా లోకేశ్‌

  • గుడిని మింగే ఘనమైన కుటుంబ చరిత్ర ప్రతిపక్ష నేతది
  • నకిలీ పార్టీ నాయకుడు తిరుమల గురించి మాట్లాడుతున్నారు
  • ప్రజా సంపదను నేలమాళిగల్లో నుండి సీబీఐ తవ్వి తీస్తుంది

గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగే ఘనమైన కుటుంబ చరిత్ర ఉన్న ప్రతిపక్ష నేత, నకిలీ పార్టీ నాయకుడు తిరుమల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ జగన్‌ని ఉద్దేశించి ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేస్తూ విరుచుకుపడ్డారు. 'తిరుమల ఆభరణాలు, విలువైన ప్రజా సంపదను ఇడుపులపాయ, లోటస్ పాండ్, యలహంక కోటలో ఉన్న నేలమాళిగల్లో నుండి సీబీఐ తవ్వి తీస్తుంది' అని పేర్కొన్నారు.
 
'ప్రత్యేక హోదా గురించి ప్రధానిని నిలదీసే దమ్ము, ధైర్యం లేని ఏ1, ఏ2 లు... పోరాటం చేస్తోన్న టీడీపీపై బీజేపీతో కలిసి క్విడ్ ప్రోకో రాజకీయాలకు తెర లేపారు. గతంలో తిరుమల జోలికి వచ్చిన వారు ఎక్కడ ఉన్నారో మీకే బాగా తెలుసు' అని లోకేశ్‌ మరో ట్వీట్‌ చేశారు.

కాగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడి, వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైంది కాదని జగన్ మండిపడుతోన్న విషయం తెలిసిందే.         

  • Loading...

More Telugu News