Tollywood: మా మధ్య ఎలాంటి వివాదం లేదు: హీరో ప్రభాస్

  • కరణ్ జోహార్ కు, నాకు మధ్య వివాదం ఉందంటూ వార్తలు
  • ఈ విషయాన్ని కరణ్ జోహార్ నాకు ఫోన్ చేసి చెప్పాడు
  • అవన్నీ వదంతులే.. నమ్మకండి

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ కు, తనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు వస్తున్న వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదని ప్రముఖ హీరో ప్రభాస్ స్పష్టం చేశారు. దుబాయ్ లో ‘సాహో’ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ, మా ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న విషయాన్ని కరణ్ జోహార్ తనకు ఫోన్ చేసి చెప్పారని అన్నారు.

ఈ వదంతులు అబద్ధమని, వాటిని నమ్మొద్దని చెప్పారు. కాగా, బాలీవుడ్ కు ప్రభాస్ ను పరిచయం చేయాలని కరణ్ జోహార్ ప్రయత్నించారని, అందుకు, ప్రభాస్ అంగీకరించలేదనే వదంతులు ఇన్నాళ్లూ హల్ చల్ చేశాయి. ప్రభాస్ చేసిన తాజా ప్రకటనతో ఈ వదంతులకు చెక్ పడింది.

Tollywood
Bollywood
Prabhas
Karan Johar
  • Loading...

More Telugu News