Chandrababu: ఊహించని సన్నివేశం... వేదికపై చేతులు కలిపిన చంద్రబాబు, రాహుల్ గాంధీ

  • కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఊహించని సన్నివేశం
  • చంద్రబాబు వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన రాహుల్ గాంధీ
  • భుజంపై చేయి వేసి అభినందించిన చంద్రబాబు

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయింది. ఈ సందర్భంగా వేదికపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, మమతా బెనర్జీ, మాయావతి వంటి హేమాహేమీలంతా కొలువుదీరారు. ప్రమాణస్వీకారం పూర్తి కాగానే జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత వేదికపై ఉన్న పెద్దలంతా ఒకరితో మరొకరు కరచాలనం చేసుకుంటూ, చేతులు గాల్లో ఊపుతూ సంతోషంగా గడిపారు.

ఇంతలోనే చంద్రబాబు వద్దకు రాహుల్ గాంధీ వచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత రాహుల్ భుజంపై చంద్రబాబు చేయి వేసి, అభినందించారు. కొన్ని క్షణాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్, టీడీపీ అధినేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం, మాట్లాడటం... ఊహించనటువంటి ఒక కొత్త సన్నివేశాన్ని ఆవిష్కరించింది.

Chandrababu
Rahul Gandhi
shake hand
  • Error fetching data: Network response was not ok

More Telugu News