Karnataka: నేనెప్పుడూ అలా చెప్పలేదు!: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

  • సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నానని నేనెప్పుడు చెప్పలేదు  
  • కుమారస్వామి సీఎం కానుండటంపై ‘కాంగ్రెస్’లో అసంతృప్తి లేదు
  • మేమంతా ఒక్కటే..మా పార్టీ అధికారంలోకి రావడం సంతోషం

కర్ణాటక సీఎం పదవిపై తాను ఆశలు పెట్టుకున్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కొట్టిపారేశారు. బెంగళూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎంను అవుతానని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. కుమారస్వామి గౌడ ముఖ్యమంత్రి కానుండటంపై కాంగ్రెస్ పార్టీలో ఎవరూ అసంతృప్తితో లేరని, తామంతా ఒక్కటేనని చెప్పారు.

కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. కాగా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తున్న సమయంలో... శివకుమార్ అన్నీ తానై చక్రం తిప్పారు.  

Karnataka
Congress
dk siva kumar
  • Loading...

More Telugu News