shivaparvathi: సావిత్రి గారే కాదు .. కీర్తి సురేశ్ కూడా గుర్తుండిపోతుంది: నటి శివపార్వతి

  • నేను సావిత్రి అభిమానిని '
  • 'మహానటి' చూశాను 
  • కీర్తి సురేశ్ అద్భుతంగా చేసింది 

పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోతూ ప్రేక్షకుల ఆదరణ పొందిన శివపార్వతి, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను ముచ్చటించారు. రీసెంట్ గా థియేటర్స్ కి వచ్చిన 'మహానటి' సినిమాను గురించి ఆమె ప్రస్తావించారు. "సావిత్రిగారికి గల అభిమానులలో నేను ఒక దానిని. ఆమె చనిపోయేనాటికి నేను చిన్నదానిని. ఆ తరువాత ఆర్టిస్టును అయ్యాక ఆమెను గురించి తెలుసుకుంటూ వచ్చాను"

"సావిత్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకి వెళ్లడం వలన .. ఆమె పేరు మీద నేను అవార్డులు తీసుకోవడం వలన ఆమె గురించి మరికొంత తెలిసింది. సావిత్రి గారు గుర్తొచ్చినప్పుడల్లా, ఇంతమంచి ఆర్టిస్ట్ కి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏమిటా అని మనసు మూగబోతూ ఉంటుంది. 'మహానటి' చూస్తుంటే సావిత్రిని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే అనిపించింది. సావిత్రిని అనుకరించకుండా కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. 'మహానటి'గా సావిత్రి మాత్రమే కాదు .. ఆమె పాత్రను పోషించిన కీర్తి సురేశ్ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News