Chandrababu: మమతా బెనర్జీతో కలసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు

  • ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది
  • భవిష్యత్తులో జేడీఎస్ తో కలసి పని చేస్తాం
  • మమత, మాయావతిలతో చంద్రబాబు భేటీ

కుమారస్వామి ప్రమాణస్వీకారం కోసం బెంగళూరుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ బిజీబిజీగా గుడుపుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్ర మమతాబెనర్జీతో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన... దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. జాతి ప్రయోజనాల కోసం అన్ని ప్రాంతీయ పార్టీలు కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అన్ని ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసేందుకే అందరం వచ్చామని అన్నారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలను చేపట్టబోతున్న కుమారస్వామిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకే నేతలందరం వచ్చామని చెప్పారు. అంతకు ముందు ఆయన మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఈ సందర్భంగా ఆమెకు వివరించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఆయన భేటీ అయి, చర్చలు జరిపారు. మరోవైపు, కుమారస్వామి ప్రమాణస్వీకారానికి శరద్ పవార్, సీతారాం ఏచూరి, అఖిలేష్ యాదవ్ తదితర నేతలంతా వచ్చారు.

Chandrababu
benguluru
mayavathi
mamatha banerjee
kumaraswamy
  • Loading...

More Telugu News