railway protection force: రైల్వే రక్షక దళంలో భారీ సంఖ్యలో కొలువుల భర్తీ... నోటిఫికేషన్ విడుదల

  • 8,619 కానిస్టేబుల్ పోస్టులు
  • ఎస్ఐ పోస్టులు 1,120
  • కానిస్టేబుల్ పోస్టుల్లో సగం మహిళలతోనే భర్తీ

నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రక్షక దళం, రైల్వే రక్షక ప్రత్యేక దళంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 8,619 కానిస్టేబుల్, 1,120 ఎస్ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. కానిస్టేబుల్ పోస్టుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వీటిలో పురుషులకు 4,403 పోస్టులను కేటాయించగా, 4,216 పోస్టులను మహిళలతో భర్తీ చేయనున్నారు. సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల్లో మగవారికి 819, మహిళలకు 301 పోస్టులను కేటాయించారు. ఉద్యోగ అర్హతలు, ఇతర వివరాల కోసం ఈ నెల 19-25 నాటి ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రికను చూడాలని రైల్వే శాఖ సూచించింది. ఈ విషయమై రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయెల్ సైతం ట్వీట్టర్లో ట్వీట్ చేశారు.

railway protection force
recruitment
  • Loading...

More Telugu News