Anantapur District: నేను తలచుకుంటే నువ్వు, నీ తల్లి ఉండరు: టీడీపీ నేతపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • గుత్తిలో పర్యటించిన జేసీ
  • మునిసిపల్ చైర్ పర్సన్ కుమారుడిపై అనుచిత వ్యాఖ్యలు
  • ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడినందుకే!

తనకు ఆగ్రహం వస్తే ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే పట్టించుకోరన్న పేరు తెచ్చుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి నోరు జారి వార్తల్లోకి ఎక్కారు. నేడు అనంతపురం జిల్లా గుత్తిలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి పర్యటించిన ఆయన, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తులసమ్మ తనయుడు శీనును టార్గెట్ చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

తాను తలచుకుంటే నువ్వు, నీ తల్లి ఉండరని బెదిరింపులకు దిగారు. గుప్తాకు టీడీపీ సభ్యత్వం లేదని, ఆయన్ను తనకు పోటీగా తీసుకొస్తున్నారని గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తితో ఉండగా, ఆయనకు మద్దతుగా శీను మాట్లాడినందునే జేసీకి ఆగ్రహం వచ్చినట్టు తెలుస్తోంది.

Anantapur District
Gutti
JC Diwakar Reddy
  • Loading...

More Telugu News