radhika: వారి కుటుంబాల గురించి నా గుండె కొట్టుకుంటోంది: నటి రాధిక

  • తూత్తుకుడి కాల్పుల్లో 11 మంది దుర్మరణం
  • మరణించినవారి కుటుంబాలకు సానుభూతిని తెలిపిన రాధిక
  • జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఆవేదన

తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులు తమిళనాట మరణమృదంగం మోగించాయి. విస్తరణ పనులను ఆపివేయాలంటూ స్థానికులు గత 100 రోజులుగా ఆందోళన చేపట్టినా ఎలాంటి స్పందనరాలేదు. దీంతో, నిరసనకారులు తమ ఆందోళనను నిన్న మరింత తీవ్రతరం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసానికి పూనుకున్నారు.

ఈ క్రమంలో జరిగిన పోలీసు కాల్పుల్లో 11 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో, సినీ నటి రాధిక స్పందిస్తూ 11 మంది అమాయకులు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, ఎంతో బాధ కలుగుతోందని చెప్పారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించినవారి కుటుంబాల గురించి తన గుండె కొట్టుకుంటోందని అన్నారు.

radhika
thoothkudi
shooting
  • Loading...

More Telugu News