nagarjuna: 'మనం' సినిమాకి నాలుగేళ్లు .. తండ్రి జ్ఞాపకాల్లో నాగ్

  • అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన 'మనం' 
  • అందరి ఆదరణ పొందిన అరుదైన చిత్రం 
  • తండ్రి జ్ఞాపకాల వెంట నాగార్జున

అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా 'మనం' తెరకెక్కింది. అక్కినేని కుటుంబానికి చెందిన నాగార్జున .. నాగచైతన్య .. అఖిల్ .. ఈ సినిమాలో నటించి అభిమానులకు ఆనందాన్ని కలిగించారు. ఒక కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు కలిసి నటించడం .. ఆ సినిమా ఘన విజయాన్ని సాధించడం అరుదైన విషయం.

 అక్కినేని వారసులు నటించడం వల్లనే కాదు .. అందుకు తగిన విధంగా కథ కుదరడం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలకు చేరువైంది. ఈ రోజుతో ఈ సినిమా 4 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తండ్రి జ్ఞాపకాలు మరోమారు మనసును తాకగా నాగార్జున స్పందించారు.

"మీరు మాకు నవ్వడం నేర్పించారు .. బాధను ఎదుర్కోవడం నేర్పించారు .. జీవితాన్ని .. మరణాన్ని ఫేస్ చేయడమెలాగో నేర్పించారు. మాలో ఇంతటి స్ఫూర్తిని నింపిన మీ గురించే మేమంతా ఆలోచిస్తూ ఉంటాము" అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.  

nagarjuna
chaitu
akhil
  • Error fetching data: Network response was not ok

More Telugu News