Chandrababu: రమణ దీక్షితులు ఇంట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోనా?... వెంకన్న ఊరుకుంటాడా?: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • బీజేపీ కుట్రలో భాగంగానే రమణ దీక్షితులు ఆరోపణలు
  • ఢిల్లీకి పిలిపించుకుని ఆరోపణలు చేయిస్తున్నారు
  • ఆరోపణలపై వివరణ కోరానన్న చంద్రబాబు

తనపై బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే తిరుమల ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారని, అమిత్ షా, మోదీలు దగ్గరుండి ఆయనతో మాట్లాడిస్తున్నారని, పరమ పవిత్రమైన, దేశంలోనే నంబర్ వన్ ఆలయంగా ఉన్న టీటీడీని తమ అధీనంలోకి తీసుకోవాలన్నదే బీజేపీ అభిమతమని, దాన్ని ఎన్నటికీ జరగనీయబోనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ అనుకున్నది జరగబోదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని, తనను అప్రదిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో రమణ దీక్షితులుని ఢిల్లీకి పిలిపించుకుని, తనపై లేనిపోని ఆరోపణలు చేయించిందని అన్నారు.

"ఈయన (రమణ దీక్షితులు) కూడా ఈయనింట్లో వెంకటేశ్వరస్వామి పక్కనే రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టుకునే పరిస్థితికి వచ్చాడంటే, ఈయన ఎలాంటి స్వామో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను మీకు తెలియజేసుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలపైనా తాను టీటీడీ ఈఓ నుంచి వివరణ కోరానని, అన్నీ బాగున్నాయని, స్వామిని ఎన్నడూ పస్తు పెట్టలేదని అనిల్ సింఘాల్ తనకు చెప్పారని చంద్రబాబు అన్నారు. తనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే వెంకన్న ఊరుకోబోడని హెచ్చరించారు.

Chandrababu
TTD
Ramana Deekshitulu
Tirumala
YSR
  • Loading...

More Telugu News