Madala Rangarao: మరింత విషమంగా మాదాల రంగారావు పరిస్థితి!

  • నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న మాదాల రంగారావు
  • లైఫ్ సేవింగ్ మెషీన్ సాయంతో కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాం
  • అభిమానుల ప్రార్థనలే కాపాడతాయన్న తనయుడు 

శ్వాసకోశ సమస్యల కారణంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న రెడ్ స్టార్ మాదాల రంగారావు ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సహాయంతో శ్వాసను తీసుకుంటున్నారని ఆయన కుమారుడు మాదాల రవి తెలిపారు. ఆయనకు డయాలసిస్ నిర్వహిస్తున్నారని, లైఫ్ సేవింగ్ మెషీన్ సాయంతో ఆయన్ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఆయన కిడ్నీలు చెడిపోయాయని, ఊపిరి తీసుకోలేకున్నారని, శరీరంలోని పలు అవయవాల పనితీరు మందగించిందని, డాక్టర్లు తాము చేయగలిగినదంతా చేస్తున్నారని, అభిమానుల ప్రార్థనలతో ఆయన కోలుకుంటారనే భావిస్తున్నానని అన్నారు. గతంలో ఆయనకు బైపాస్ జరిగిందని, అంతకుముందు ఓ సారి హార్ట్ ఎటాక్ కూడా వచ్చిందని గుర్తు చేసిన రవి, అప్పట్లోనూ తన తండ్రి ప్రాణాల కోసం పోరాడి బయటపడ్డారని వెల్లడించారు.

Madala Rangarao
Madala Ravi
Serious Health Condition
Star Hospital
  • Loading...

More Telugu News