Nagarjuna: నాగ్ .. నాని మల్టీ స్టారర్ రీమేక్ కాదు: శ్రీరామ్ ఆదిత్య

- మల్టీ స్టారర్ ప్రాజక్టు చేస్తున్న శ్రీరామ్ ఆదిత్య
- హీరోలుగా నాగ్ .. నాని
- కథానాయికలుగా ఆకాంక్ష సింగ్ .. రష్మిక మందన
మొదటి నుంచి కూడా నాగార్జున కొత్తదనంతో కూడిన కథలను చేస్తూ వచ్చారు. మల్టీ స్టారర్ మూవీలు చేయడంలోనూ ఆయన ముందుంటూ వచ్చారు. ఇక నాని విషయానికొస్తే అన్నివర్గాల ప్రేక్షకులతో పక్కింటి అబ్బాయి అనిపించుకుని నేచురల్ స్టార్ గా మార్కులు కొట్టేశాడు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ ను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందిస్తున్నాడు.
