Ekta Kapoor: మండుతున్న పెట్రోలును, యువతీ యువకులను పోల్చుతూ నిర్మాత ఏక్తాకపూర్ వ్యాఖ్యలు!

  • రికార్డు స్థాయికి పెట్రోలు ధర
  • ఎక్కువ సేపు డ్రైవింగ్ చేసే బదులు మూవీ థియేటర్ కు వెళ్లండి
  • యువతీ యువకులకు సలహా

ఇండియాలో పెట్రోలు, డీజెల్ ధరలు ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి పెరిగిన వేళ, బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్, పెరిగిన ధరలను, యువతీ యువకులను పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 పెట్రోలు ధరలు ఎంతగా పెరిగినా, అబ్బాయిలు, అమ్మాయిలను బయటకు తీసుకెళ్లడాన్ని ఆపరని, ఇవాళ, రేపు అమ్మాయిలు కూడా అబ్బాయిలను బయటకు తీసుకెళుతున్నారని ఏక్తా కపూర్ వ్యాఖ్యానించింది. ధరల మంట నుంచి తప్పించుకోవాలంటే, ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయకుండా, సినిమా హాల్ లో కూర్చుని ఎక్కువ సమయాన్ని గడపాలని సలహా ఇచ్చింది. ఇదే సమయంలో ఓ సినిమా అయితే, చూడకుండా వదిలేయొచ్చుగానీ, పెట్రోలును కొనకుండా ఆపలేమని కూడా ఆమె పేర్కొంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News