keerti suresh: 30 కోట్లకి చేరిన 'మహానటి' వసూళ్లు

  • 'మహానటి'కి నీరాజనాలు 
  • అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లు 
  • సావిత్రి పట్ల గల క్రేజ్ కారణం 

తెలుగు తెరపై నిండైన చందమామగా ప్రేక్షకులను మెప్పించిన కథానాయిక సావిత్రి. కళ్లతోనే నవరసాలను పలికించే ఆమె తీరుకి అప్పటికీ .. ఇప్పటికీ అభిమానులు వున్నారు. అలాంటి సావిత్రి జీవితంలో ఆనంద సమయాలు .. విషాద సంఘటనలు వున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ సంఘటనలకు దృశ్యరూపాన్నిచ్చి 'మహానటి'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇంతవరకూ 30 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం. సావిత్రి పట్ల గల క్రేజ్ .. ఆమె జీవితాన్ని వాస్తవానికి దగ్గరగా మలచడం వలన ఈ సినిమాకి ఈ స్థాయి ఆదరణ లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

keerti suresh
dulquer
  • Loading...

More Telugu News